
సీఎం చేతుల మీదుగా ఐపీఎం స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): విజయవాడ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరిరావు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం) స్వీకరించారు. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది శ్రీహరిరావును పలువురు పోలీసు అధికారులు అభినందించారు.
అసిస్టెంట్
కమిషనర్‌కు అవార్డు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఏసీ (అసిస్టెంట్ కమిషనర్) పి.దయాసాగర్, హెడ్‌కానిస్టేబుల్ ఎం.కిరణ్‌సింగ్‌కు అవార్డులు వరించాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
50 మద్యం బాటిళ్ల స్వాధీనం
వెంకటాచలం: అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని 50 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలోని చవటపాళెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారని వెంకటాచలం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో గ్రామానికి వెళ్లి రామాలయం వద్ద ఉన్న రావుల ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిని విచారించారు. అతని వద్ద సుమారు రూ.6,500 విలువైన 50 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వాటిని నెల్లూరు నగరంలోని మందాకిని షాప్ నుంచి తీసుకొస్తున్నానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం చేతుల మీదుగా ఐపీఎం స్వీకరణ