
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మైనింగ్‌తో నాకెలాంటి సంబంధం లేదు
నెల్లూరు రూరల్: భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిటీతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1077, 79955 76699, 0861 – 2331261 కంట్రోల్ రూమ్ నంబర్లు, డివిజన్, మండల కేంద్రాల్లోని కాల్ సెంటర్లు, స్థానిక సచివాలయాలను సంప్రదించాలని కోరారు. డీఆర్వో హుస్సేన్‌న్‌సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, మత్స్యశాఖ జేడీ శాంతి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయన్, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎస్‌ఈలు దేశ్‌నాయక్, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల విచారణలో బిరదవోలు వెల్లడి
సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసును కూటమి నేతలు బనాయించారని, మైనింగ్‌తో తనకెలాంటి సంబంధం లేదంటూ పోలీసుల కస్టడీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారని సమాచారం. పొదలకూరు మండలం తాటిపర్తి మైనింగ్ కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ గురువారంతో ముగిసింది. చివరి రోజున డీటీసీలో పోలీస్ అధికారులు ఆయనకు 23 ప్రశ్నలేయగా, లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తనది మనుబోలు మండలం మడమనూరు అని.. రాజకీయంగా మాజీ మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పరిచయమని.. తమ ఊరి సమస్యలపై వీరితో మాట్లాడేవాడినని.. రుస్తుం మైన్స్‌తో పాటూ క్వార్ట్‌జ్ వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసని బిరదవోలు వెల్లడించారని తెలిసింది.