
చెరువును తవ్వేస్తున్నారు
దగదర్తి : మండలంలోని వెలుపోడు పంచాయతీ కామినేనిపాళెం చెరువులో టీడీపీ నేతలు టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నారు. 24 గంటలు టిప్పర్లతో యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు దగదర్తి మండలం ఉలవపాళ్ల, దామవరం, సున్నపుబట్టి, కౌరుగుంట, మబ్బుగుంటపాళెం, అనంతవరం చెరువుల్లో పోరంబోకు, మేత పోరంబోకు భూముల్లో గ్రావెల్ తవ్వకాలతో ప్రకృతి సహజ స్వరూపం కోల్పోతున్నాయి. ప్రధానంగా దగదర్తి మండలం దామవరం వద్ద ఎయిర్‌పోర్ట్‌కు కేటాయించిన భూములు, పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లోనూ గ్రావెల్‌ను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ముఖ్యంగా ఇఫ్కో భూముల్లోనూ వెనుక వైపు నుంచి భారీగా తవ్వేస్తున్నారు.