
ఎనభై శాతం మంది మహిళల ఆర్థిక నిర్ణయాలలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజా అధ్యయనం తెలియజేసింది. మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ ఒపినియన్ పోలింగ్ కంపెనీ ‘ఐపీఎస్‌వోఎస్’ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలోని 25–45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
బడ్జెట్ ప్లానింగ్, మ్యూచువల్ ఫండ్స్... మొదలైన వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవడానికి మహిళలు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి నిమిషాల వ్యవధిలో సులభంగా వివరించే ఇన్‌స్టాగ్రామ్‌లోని షార్ట్ రీల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ డక్ట్స్‌కు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌లు షేర్ చేసే టిప్స్ మహిళలకు ఉపయోగపడుతున్నాయి.
స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో మహిళలకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి 57 శాతం మంది యూజర్‌లు ఇన్‌స్టాగ్రామ్‌పైనా, 53 శాతం మంది యూజర్‌లు ఫేస్‌బుక్‌పై ఆధారపడుతున్నారు.
‘అథెంటిసిటీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 75 శాతం మంది ఫైనాల్సియల్ పాడ్‌కాస్ట్‌లకు, 67 శాతం మంది ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, ఆర్థిక విషయ నిపుణుల సలహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కొత్త స్కీమ్ గురించి తెలుసుకోవడం నుంచి దాని మంచిచెడ్డల గురించి విశ్లేషించుకోవడం వరకు ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించి వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్టడీ రిపోర్ట్ తెలియజేసింది.
(చదవండి: ఉమెన్ సెక్యూరిటీ ‘క్యూఆర్ కోడ్స్’)