
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త విధానాన్ని అనుసరించారు మహారాష్ట్రలోని నాగ్‌పుర్ పోలీసులు. నగరంలో నేరాలకు ఆలవాలంగా ఉన్న 330 ప్రదేశాలను గుర్తించి క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లు, సేఫ్టీ రిసోర్స్‌కు సంబంధించి త్వరగా యాక్సెస్ కావడానికి ఆపదలో ఉన్న మహిళలకు ఈ క్యూ ఆర్ కోడ్‌లు ఉపయోగపడతాయి.
నేరాలను బట్టి మరిన్ని ప్రాంతాలకు ఈ క్యూఆర్ కోడ్‌లను విస్తరిస్తారు. ‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం’ అంటున్నారు సీపీ రవీందర్ సింఘాల్. మహిళల భద్రతకు సంబంధించిన ‘దామిని స్క్వాడ్స్’ కోసం అయిదు ప్రత్యేకమైన ఆల్–ఉమెన్ వాహనాలను ఏర్పాటు చేశారు.
ఈ స్క్వాడ్‌లో 19 మంది మహిళా అధికారులు ఉన్నారు. ‘మా బృందాలలోని సభ్యులు ప్రతి స్కూల్‌కు వెళ్లి బాలికల భద్రతకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
బాలికలకు వారి హక్కుల గురించి తెలియజేయడం తోపాటు అవసరమైన సమయాలలో సహాయం ఎలా తీసుకోవాలి... వంటి విషయాల గురించి వివరిస్తున్నారు’ అంటున్నారు ‘భరోసా సెల్’ హెడ్ సీమా సుర్వే.
(చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..)