
ట్యాంకర్‌ను ఢీకొట్టిన మినీలారీ
● డ్రైవర్ మృతి
ఉలవపాడు: చెట్లకు నీరు పట్టే హైవే అథారిటీ ట్యాంకర్‌ను మినీలారీ ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెండాడు. ఈ ఘటన జాతీయ రహదారిపై వీరేపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన మినీలారీ చైన్నె నుంచి విజయవాడకు వెళ్తోంది. వీరేపల్లి వద్ద చెట్లకు ట్యాంకర్ ద్వారా నీరుపడుతున్నారు. మినీలారీ వేగంగా వచ్చి ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. మినీలారీ డ్రైవర్ మహ్మద్ రియాజ్ (35)కు తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది అతడిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అంకమ్మ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలలో ఉంచారు.