
ఆయిల్‌పామ్ రైతుల విలవిల
వింజమూరు, కొండాపురం, దుత్తలూరు, జలదంకి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, వెంకటాచలం, పొదలకూరు, చేజర్ల, కలువాయి, దగదర్తి, బాలాయపల్లి, వెంకటగిరి, దొరవారిసత్రం.
ఉద్యాన పంటల్లో ప్రసిద్ధి గాంచిన ఆయిల్‌పామ్ సాగు విషయంలో ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం లేక రైతులు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల 10 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించడం సాగుదారుల పాలిట శాపంగా మారింది. దీంతో టన్ను ధర తగ్గడంతో నష్టపోతున్నారు.
● దిగుమతి సుంకాన్ని భారీగా
తగ్గించిన ప్రభుత్వం
● టన్నుకు రూ.3,600 వరకు నష్టం
● ఆందోళనలో సాగుదారులు
● కనీస ధర రూ.22 వేల కోసం
డిమాండ్
సాగు
ఎక్కడంటే..
ఉదయగిరి: ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్ 7,500 ఎకరాల్లో ఉంది. జిల్లాలో పాతికేళ్ల నుంచి ఈ పంట సాగు చేస్తున్నారు. మొదట్లో సాగు బాగున్నా, మధ్యలో ధరల్లో ఒడిదుడుకుల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కొన్నిచోట్ల తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటలు వేశారు. గత నాలుగేళ్ల నుంచి ధరలు ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపారు.
ధర పతనం
గెలల ధర పడిపోతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం 2022లో టన్ను గెలలకు అత్యధికంగా రూ.22,500 ధర లభించింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధర. అయితే వివిధ కారణాలతో 2023, 2024 సంవత్సరాల్లో గెలల సగటుఽ ధర ఏ దశలోనూ రూ.15 వేలకు చేరుకోలేదు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు టన్ను రూ.20 వేలు దాటింది. అయితే కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకం 27 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం రైతులకు శాపంగా మారింది. ఆయిల్ కంపెనీలు వివిధ దేశాల నుంచి తక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. ఫలితంగా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గెలల ధర రూ.20,935 నుంచి ఏకంగా రూ.17,340కు పడిపోయింది. ప్రభుత్వం ఇలాగే దిగుమతి సుంకాన్ని కొనసాగిస్తే ధరలు మరింత దిగజారే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిటీ సూచించిన విధంగా ఆయిల్‌పామ్ గెలల కనీస ధర టన్నుకు రూ.22 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడు నెలలుగా ఆయిల్‌పామ్ గెలల ధరలు (టన్ను)

ఆయిల్‌పామ్ రైతుల విలవిల

ఆయిల్‌పామ్ రైతుల విలవిల