
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
● మరో వ్యక్తికి గాయాలు
మర్రిపాడు: మండల కేంద్రమైన మర్రిపాడు హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి మోటార్‌బైక్‌పై మహమ్మద్ (20), ఆకాష్ బద్వేల్‌కు బయలుదేరారు. మర్రిపాడులోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారి సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తుతెలియని లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్ మృతిచెందగా ఆకాష్ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది.