
నృసింహునికి తులసీ దళార్చన
రాపూరు: శ్రావణ పౌర్ణమి సందర్భంగా పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శనివారం తులసీ దళార్చన అత్యంత వైభవంగా జరిగింది. నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాల నడుమ శ్రీవారి నందనంలోని ప్రత్యేక మండపంలో తులసీ దఽళాలతో ప్రత్యేక పూజలు, ఆదిలక్ష్మీదేవికి కుంకుమార్చన సేవ జరిగింది. రాత్రి బంగారు గరుడ వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహం కొలువుదీర్చి అలంకరించారు. కోనలోని మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.
ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు
● ఒకరి మృతి, నలుగురికి గాయాలు
● రాజుపాళెం వద్ద ఘటన
ఉలవపాడు: రెండు ద్విచక్ర వాహనాలను కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై రాజుపాళెం జంక్షన్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల ప్రశాంత్ (28), కల్యాణ్, ఏడేళ్ల వయసున్న సాయికృష్ణ బైక్‌పై ఉలవపాడు నుంచి భీమవరం వెళ్లడానికి రాజుపాళెం జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్నారు. ఈ సమయంలో గూడూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ప్రశాంత్ బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. తర్వాత రోడ్డుమార్జిన్ వైపునకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రాజుపాళెం నుంచి ఉలవపాడుకు మరో బైక్‌పై వెళ్తున్న జొన్నాబత్తిన గిరి, మురళీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ మృతిచెందాడు. కల్యాణ్, సాయికృష్ణ తీవ్రంగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడులోని సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నృసింహునికి తులసీ దళార్చన

నృసింహునికి తులసీ దళార్చన