
పథకాలు అందాలంటే జగనన్న రావాలి
గుడ్లూరు: ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందాలంటే ముఖ్యమంత్రిగా జగనన్న రావాలని మాజీ ఎమ్మెల్యే, కందుకూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని చేవూరులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి బాబు మోసాలను తెలియజేస్తూ ప్రజలతో మాట్లాడారు. అంబేడ్కర్‌ను చూస్తే రాజ్యాంగం, అబ్దుల్ కలాంను చూస్తే రాకెట్లు, ఉపగ్రహాలు గుర్తుకు వచ్చినట్లు చంద్రబాబును చూస్తే దగా, నయవంచన గుర్తుకు వస్తాయన్నారు. బాబు ఎన్నో పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. వృద్ధులకు నూతన పెన్షన్ రాలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి బడుగు, బలహీనవర్గాలను మోసం చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కన్నా ఎక్కువ పథకాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారన్నారు.
సుపరిపాలన కాదు
మోసపూరిత పరిపాలన
తల్లికి వందనం తప్ప ఇంకా ఏ పథకం ఇవ్వలేదన్నారు. అది కూడా అరకొరగా ఇచ్చి కోతలు పెట్టారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పెట్టామన్నారు. కానీ ఆ డబ్బులు అందరికీ వేయడం లేదన్నారు. చంద్రబాబు ఇటీవల సుపరిపాలన అనే కార్యక్రమం పెట్టారని, అది మోసపూరిత పరిపాలన అన్నారు. ఎన్నికలప్పుడు ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీలిచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలియజేశారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అందడం లేదని, జగనన్న ఉన్నప్పుడే పథకాలు సక్రమంగా పడ్డాయని తెలియజేశారు. గడిచిన కాలంలో ప్రజలను ఎలా మోసం చేశారనేది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంత నష్టపోయారని ప్రజలకు వివరించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పులి రమేష్, మండల అధ్యక్షుడు కాపులూరి కృష్ణయాదవ్, ఉపాధ్యక్షుడు బిళ్లా రమణయ్య, జిల్లా నాయకులు తోకల కొండయ్య, చీమలరాజా, రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి, నియోజకవర్గ నాయకులు నల్లమోతు చంద్రమౌళి, పాలవల్లి అమర్‌నాథ్‌రెడ్డి, షేక్ రహీమ్, చల్లా విఘ్నేష్, నక్కల శరత్, నక్కల రామకృష్ణ, ఎందేటి శేషయ్య, ఇమ్మని నరసింహారావు, ఎల్లంటి శ్రీను, ఏలియా, సుబ్బరాయుడు, నరసింహ, శ్రీను, మల్లికార్జున, రవికాంత్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే, కందుకూరు
వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బుర్రా
చేవూరులో
బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ
వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరణ