
పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ..
● తమిళనాడు వాసి సైకిల్ యాత్ర
ఉదయగిరి: పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ముత్తు సెల్వన్ సైకిల్ యాత్ర చేపట్టారు. శనివారం ఉదయగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు, పర్యావరణంపై అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామన్నారు. అన్ని రాష్ట్రాలతోపాటు ప్రపంచంలోని ఏడు దేశాల్లో యాత్ర చేస్తానన్నారు.