Wrestling Federation Of India Elections Held On July 6, Says Returning Officer - Sakshi
Sakshi News home page

#WrestlersProtest: జూలై 6న భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు 

Jun 14 2023 9:26 AM | Updated on Jun 14 2023 10:15 AM

Wrestling Federation-India Elections Held-July 6 Says Returning Officer - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు జూలై 6వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం నియమించిన ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 23 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28న వాటిని పరిశీలిస్తారు. జూలై 2న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.    

Advertisement
 
Advertisement
Advertisement