ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ రెండు వేదికలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు వడోదరలోని కొటాంబి స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. దీనిపై ఈ నెల 26న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. తర్వాతి రోజు 27న లీగ్ కోసం వేలం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పురుషుల టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ మరింత ముందుగా జరపనున్నారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.


