న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి పోరు.. తుది జట్లు ఇవే | Womens T20 World Cup 2024: New Zealand Win Toss, Opt To Bat vs India | Sakshi
Sakshi News home page

T20 WC 2024: న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి పోరు.. తుది జట్లు ఇవే

Oct 4 2024 7:19 PM | Updated on Oct 4 2024 8:30 PM

Womens T20 World Cup 2024: New Zealand Win Toss, Opt To Bat vs India

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ తొలి పోరులో భారత జట్టు ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. శ్రేయాంక పాటిల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో తుది జట్టులో చోటు దక్కించుకోగలిగింది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఇద్దరు ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడనుంది.

తుది జట్లు
భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్

న్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్‌), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్‌ కీపర్‌), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement