IPL 2022: లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్.. విజయం ఎవరిది..?

ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ఎంసీఏ స్టేడియం వేదికగా శుక్రవారం(ఏప్రిల్ 29) లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. సీస్‌కేతో జరిగన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిపొందింది.
ఇక ఇరు జట్లు బలాబలాలు విషయానికి వస్తే.. బ్యాటింగ్ పరంగా ఇరు జట్లు పటిష్టంగా ఉన్నాయి. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా జట్టులో డికాక్, స్టోయినిష్, మనీష్ పాండే వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ పరంగా కూడా లక్నో సూపర్ జెయింట్స్ బలంగా కన్పిస్తోంది. జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా వంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నారు.
ఇక పంజాబ్ కూడా బ్యాటింగ్ పరంగా దృఢంగా ఉంది. శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం. అదే విధంగా మిడిలార్డర్‌లో బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, రాజపాక్స వంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా రబాడ, ఆర్షదీప్ సింగ్, రాహుల్ చహర్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు.
పిచ్ రిపోర్ట్:
ఈ గ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో తక్కువ స్కోర్ నమోదైంది. ఎంసీఏ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు అనుకులిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
చదవండి: IPL 2022: 'అది ఒక విచిత్రమైన కెప్టెన్సీ'.. రిషభ్ పంత్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు
మరిన్ని వార్తలు