IPL 2022: 'అది ఒక విచిత్రమైన కెప్టెన్సీ'.. రిషభ్ పంత్ పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ విమర్శలు

Michael Vaughan baffled as Kuldeep Yadav doesnt complete his quota of overs against KKR - Sakshi

ఐపీఎల్‌-2022లో గురువారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన కుల్ధీప్‌.. 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే అద్భుతంగా బౌలింగ్‌ చేసిన కుల్ధీప్‌ను తన నాలుగు ఓవర్ల కోటాను పంత్‌  పూర్తి చేయించలేదు.

కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు.అదే సమయంలో పార్ట్ టైమ్ బౌలర్ గా ఉన్న లలిత్ యాదవ్ తో పంత్ మూడు ఓవర్లు వెయించాడు. మూడు ఓవర్లు వేసిన లలిత్ యాదవ్ 32 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో పంత్‌ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పంత్‌ వ్యూహాలపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్ ఆసంతృప్తి వక్య్తం చేశాడు.

"ఇది ఒక విచిత్రమైన కెప్టెన్సీ. మూడు ఓవర్లలో కుల్ధీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అటువంటి బౌలర్‌తో పూర్తి కోటాను ఎందకు వేయంచలేదో నాకు అర్ధం కావడం లేదు" అని వాన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. మరో వైపు మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన పంత్‌ కుల్ధీప్‌తో నాలుగు ఓవర్లు పూర్తి చేయించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కుల్దీప్‌తో ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేయంచాలని అనుకున్నాను. అయితే అప్పటికే మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే పేసర్లు తీసుకువచ్చాను. అయినప్పటికీ భారీగా పరుగులు వచ్చాయి అని పంత్‌ పేర్కొన్నాడు.]

చదవండి: Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top