భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారో తెలుసా? | What Happens If India Vs. Pakistan Asia Cup 2023 Match Is Washed Out Due To Rain? - Sakshi
Sakshi News home page

IND vs PAK: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారో తెలుసా?

Sep 2 2023 11:32 AM | Updated on Sep 2 2023 12:27 PM

What Happens if Rain Washes Out the Much awaited Face off? - Sakshi

ఆసియాకప్‌-2023లో భారత్‌-పాకిస్తాన్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. శనివారం శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఈ బ్లాక్‌ బ్లాస్టర్‌ మ్యాచ్‌ కోసం  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశం ఉంది.

ఈ కీలక మ్యాచ్‌ వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్‌ ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మ్యాచ్‌ జరిగే సమయంలో దాదాపు 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది.  ఈ మ్యాచ్‌ శనివారం మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఈ రోజు ఉదయం కూడా క్యాండీలో భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది.

మ్యాచ్ రద్దయితే..?
అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏంటి పరిస్థితి అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వర్షం కారణంగా ఆట సాధ్యపడక మ్యాచ్ రద్దయితే పాయింట్లను రెండు జట్లకు సమానంగా పంచుతారు. భారత్‌, పాక్‌ రెండు జట్లు చెరోపాయింట్‌ను తమ ఖాతాలో వేసుకు​ంటున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే పాకిస్తాన్ 3 పాయింట్లతో సూపర్‌-4కు క్వాలిఫై అవుతోంది. ఎందుకంటే నేపాల్‌పై విజయంతో పాకిస్తాన్‌ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి.

కనీసం 20 ఓవర్లు..
కాగా వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు  బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ మొదటి బ్యాటింగ్‌ చేసిన జట్టు మొత్తం ఓవర్లు ఆడి, రెండో జట్టు బ్యాటింగ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే ఛేజింగ్‌లో వేయాల్సిన ఓవర్ల పర్సంటేజితో తొలి ఇన్నింగ్స్ స్కోరును గుణిస్తారు.
చదవండిఅనవసర చర్చలు ఆపండి.. ఆ స్ధానంలో కోహ్లినే సరైనోడు: సునీల్ గవాస్కర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement