WC 2022 Australia Squad: Josh Inglis Ruled Out Cameron Green Replaces - Sakshi
Sakshi News home page

T20 WC 2022: జోష్‌ ఇంగ్లిస్‌ అవుట్‌.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్‌ జట్టులోకి

Oct 20 2022 1:39 PM | Updated on Oct 20 2022 3:17 PM

WC 2022 Australia Squad: Josh Inglis Ruled Out Cameron Green Replaces - Sakshi

కామెరూన్‌ గ్రీన్‌ (PC: Cricket Australia)

జోష్‌ ఇంగ్లిస్‌ అవుట్‌.. టీమిండియాతో సిరీస్‌లో చెలరేగిన యువ ప్లేయర్‌ జట్టులోకి

T20 World Cup 2022- Australia Updated Squad: ఆస్ట్రేలియా బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి దూరమయ్యాడు. గోల్ఫ్‌ ఆడుతూ గాయపడిన అతడు.. గాయం తీవ్రతరం కావడంతో మెగా ఈవెంట్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిస్‌ స్థానంలో కామెరూన్‌ గ్రీన్‌ జట్టులోకి రానున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఓపెనర్‌గా కామెరూన్‌ గ్రీన్‌ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

టీమిండియాతో సిరీస్‌లో హిట్‌
ముఖ్యంగా భారత పర్యటనలో టీమిండియాతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెండు హాఫ్‌ సెంచరీలతో మెరిశాడు. మొదటి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన గ్రీన్‌.. మూడో మ్యాచ్‌లో 21 బంతుల్లో 52 పరుగులతో సత్తా చాటాడు.

ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ నుంచి కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు 23 ఏళ్ల ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. 

ఇక ఇప్పుడు ఇంగ్లిస్‌ గాయపడటంతో స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆడే జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. మరోవైపు.. ఇంగ్లిస్‌ దూరం కావడంతో వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌పై అదనపు భారం పడనుంది. కాగా అక్టోబరు 22న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా సూపర్‌-12లో న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక టీమిండియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

టీ20 వరల్డ్‌కప్‌-2022: ఆస్ట్రేలియా జట్టు(అప్‌డేటెడ్‌):
ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఆష్టన్‌ అగర్‌, ప్యాట్‌ కమిన్స్‌,టిమ్‌ డేవిడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, స్టీవెన్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడం జంపా.

చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్‌.. తుది జట్టు ఇదే! పంత్‌, అశ్విన్‌, హుడాకు నో ఛాన్స్‌!
T20 WC SL Vs NED: సూపర్‌-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్‌ ఇంటికి; అద్భుతం జరిగితే తప్ప 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement