జైశ్వాల్‌, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైర‌ల్‌ | Virat Kohli Salutes Jaiswal And Rahul After Stumps On Day 2 | Sakshi
Sakshi News home page

IND vs AUS: జైశ్వాల్‌, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైర‌ల్‌

Nov 23 2024 7:00 PM | Updated on Nov 23 2024 8:38 PM

Virat Kohli Salutes Jaiswal And Rahul After Stumps On Day 2

రాహుల్‌, జైశ్వాల్‌కు సెల్యూట్‌ చేస్తున్న కోహ్లి

పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ప‌ట్టు బిగించింది. రెండో రోజు ఆట‌లో కూడా ఆతిథ్య జ‌ట్టుపై భార‌త్ పై చేయి సాధించింది.  46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైశ్వాల్ (193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అద్బుత‌మైన ఆరంభం ఇచ్చారు.

వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 172 పరుగుల అజేయ‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 172 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం భార‌త్ 218 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మొద‌టి ఇన్నింగ్స్‌లో డ‌కౌటై నిరాశ‌ప‌రిచిన జైశ్వాల్‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. తొలిసారి ఆసీస్ గ‌డ్డ‌పై ఆడుతున్న‌ప్ప‌ట‌కి త‌న అద్భుత ప్ర‌దర్శ‌నతో అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాతో త‌న తొలి టెస్టు సెంచ‌రీకి ఈ ముంబైక‌ర్ చేరువ‌య్యాడు. మ‌రోవైపు రాహుల్ సైతం త‌న క్లాస్‌ను చూపిస్తున్నాడు. రోహిత్ శ‌ర్మ స్ధానంలో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన కేఎల్‌.. త‌న‌ను త‌ను మ‌రోసారి నిరూపించుకున్నాడు. మూడో రోజు ఆట‌లో వీరిద్ద‌రూ లంచ్ సెష‌న్ వ‌ర‌కు క్రీజులో ఉంటే భార‌త్ భారీ స్కోర్ సాధించ‌డం ఖాయం.

సెల్యూట్ చేసిన కోహ్లి.. 
ఇక ఈ ఓపెనింగ్ జోడీ ప్ర‌ద‌ర్శ‌న‌కు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. రెండో రోజు ఆట అనంత‌రం ప్రాక్టీస్ కోసం మైదానంలో వ‌చ్చిన కోహ్లి.. రాహుల్‌, య‌శ‌స్వీల‌కు సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. కాగా ఆసీస్ గ‌డ్డ‌పై భారత ఓపెనర్లు 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నెల‌కొల్ప‌డం 20 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం.
చదవండి: IPL 2025: రిష‌బ్ పంత్‌కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌!?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement