Veteran Badminton Official K. Pani Rao Passes Away In Hyderabad - Sakshi
Sakshi News home page

పాణీరావు కన్నుమూత.. బ్యాడ్మింటన్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం

Jul 22 2023 7:01 AM | Updated on Jul 22 2023 8:21 AM

Veteran Badminton Official K-Pani Rao Passes-Away In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం కోశాధికారి ఎస్‌. పాణీరావు శుక్రవారం మృతి చెందారు. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న 72 ఏళ్ల పాణీరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీనియర్‌ అడ్మినిస్ట్రేటర్‌గా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయనకు బ్యాడ్మింటన్‌తో అనుబంధం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రోజులనుంచి ప్రస్తుతం తెలంగాణ సంఘం వరకు వేర్వేరు హోదా ల్లో ఆయన పని చేశారు. ముఖ్యంగా వివిధ వయో విభాగాలకు సంబంధించిన టోర్నీల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉన్న పాణీరావు వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు.  

చదవండి: సెమీఫైనల్లో సాత్విక్‌ జోడీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement