
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో హాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
నాలుగో డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 256 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తొలిసారి ఆడుతున్న నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు.
ఈ ఏడాది సీజన్‌లో తిలక్‌కు ఇది రెండో సెంచరీ. రెడ్‌బాల్ క్రికెట్‌లో ఈ హైదరాబాదీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక ఇప్పటివరకు 18 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ.. 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు.
ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హైదరాబాదీ భారత జట్టుకు వైట్-బాల్ స్పెషలిస్టుగా ఉన్నాడు. నాలుగు వన్డేలు, 25 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా అతడికి టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. 24 ఇన్నింగ్స్‌లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: డీఎస్పీ ఆన్ ఫైర్.. గొడవలు అవసరమా సిరాజ్ భయ్యా? వీడియో