మెరిసిన తెలంగాణ స్విమ్మర్లు | Telangana swimmers shine in National Junior Swimming Championship | Sakshi
Sakshi News home page

మెరిసిన తెలంగాణ స్విమ్మర్లు

Aug 20 2026 4:56 AM | Updated on Aug 20 2026 4:56 AM

Telangana swimmers shine in National Junior Swimming Championship

జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు అదరగొట్టారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో తెలంగాణ స్విమ్మర్లు ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు సాధించారు. బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మైలారి సుహాస్‌ ప్రీతమ్‌ బంగారు పతకం గెలిచాడు. సుహాస్‌ 57.33 సెకన్లలో గమ్యానికి చేరి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేయడంతోపాటు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాగి శ్రీనిత్య రజత పతకం... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్యం కైవసం చేసుకుంది. బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో అనిక దెబోరా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.  

బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌: 1. సుహాస్‌ ప్రీతమ్‌ మైలారి (తెలంగాణ; 57.33 సెకన్లు), 2. అమన్‌ అభిజిత్‌ (కర్ణాటక; 58.35 సెకన్లు), 3. సమర్థ్‌ ప్రణవ్‌ జోషి (కేరళ; 59.86 సెకన్లు).  
బాలికల 400 మీటర్ల మెడ్లే: 1. థాన్య శాదక్షరి (కర్ణాటక; 5ని:11.93 సెకన్లు), 2. శ్రీనిత్య సాగి (తెలంగాణ; 5ని:19.15 సెకన్లు), 3. పావని సరయు నాదకుడితి (ఆంధ్రప్రదేశ్‌; 5ని:19.31 సెకన్లు). 
బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌: 1. విహిత నయన లోగనాథన్‌ (కర్ణాటక; 1ని:06.50 సెకన్లు), 2. ప్రియాన్షి మిశ్రా (కర్ణాటక; 1ని:07.60 సెకన్లు), 3. శ్రీనిత్య సాగి (తెలంగాణ; 1ని:08.37 సెకన్లు). 
బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌: 1. చరిత (కర్ణాటక; 26.04 సెకన్లు), 2. తిస్యా సోనార్‌ (కర్ణాటక; 27.86 సెకన్లు), 3. అనిక దెబోరా పరిపూర్ణం (తెలంగాణ; 28.02 సెకన్లు).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement