పాకిస్తాన్‌ పర్యటనకు శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు.. షెడ్యూల్‌ విడుదల | Pakistan to host Sri Lanka, England in busy home season | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ పర్యటనకు శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు.. షెడ్యూల్‌ విడుదల

Aug 19 2026 9:23 PM | Updated on Aug 19 2026 9:25 PM

Pakistan to host Sri Lanka, England in busy home season

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సొంత గడ్డపై వరుస సిరీస్‌లను నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీలంక‌, ఇంగ్లండ్ జ‌ట్లు ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో పాక్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్ శ్రీలంక, ఇంగ్లండ్‌ల‌తో టీ20, వన్డే త్రైపాక్షిక సిరీస్‌ల‌లో త‌ల‌ప‌డ‌నుంది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగ‌మైన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కూడా పాక్‌-శ్రీలంక మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

ఈ హోమ్ సీజ‌న్ షెడ్యూల్‌లో భాగంగా తొలుత‌ అక్టోబర్ 9 నుంచి 13వ‌ర‌కు పాక్‌-శ్రీలంక మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సిరీస్ మొత్తానికి రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెడుతోంది.

శ్రీలంక-పాక్‌-ఇంగ్లండ్ మధ్య  వన్డే ట్రై-సిరీస్ అక్టోబర్ 18 నుండి 31 వరకు  రావల్పిండి , లాహోర్ వేదికల్లో జరగనుంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ట్రై-సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లోనే ఉండి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.

ఈ సిరీస్ నవంబర్ 9న రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నర రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్‌లతో పాక్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకోన్నారు. పాక్ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.

పాక్ హోమ్ సీజ‌న్ షెడ్యూల్ ఇదే

శ్రీలంకతో టీ20 సిరీస్
అక్టోబర్ 9: మొదటి టీ20 (రావల్పిండి )

అక్టోబర్ 11: రెండవ టీ20 ( రావల్పిండి )

అక్టోబర్ 13: మూడవ టీ20 ( రావల్పిండి )

అక్టోబర్ 18: పాకిస్తాన్ వర్సెస్‌ శ్రీలంక (రావల్పిండి క్రికెట్ స్టేడియం)

అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)

అక్టోబర్ 22: శ్రీలంక వర్సెస్‌ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)

అక్టోబర్ 25: పాకిస్తాన్ వర్సెస్‌ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)

అక్టోబర్ 27: పాకిస్తాన్ వర్సెస్‌ శ్రీలంక (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)

అక్టోబర్ 29: శ్రీలంక వర్సెస్‌ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)

ఫైనల్ మ్యాచ్:
అక్టోబర్ 31: ట్రై-సిరీస్ ఫైనల్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక  టెస్టు సిరీస్ 
నవంబర్ 4 - 6: 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ (ఇస్లామాబాద్)

నవంబర్ 9 - 13: మొదటి టెస్టు (రావల్పిండి)

నవంబర్ 17 - 21: రెండవ టెస్టు (లాహోర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement