గెలుపు బాటలో భారత్‌ | India close on victory in first Test against Sri Lanka | Sakshi
Sakshi News home page

గెలుపు బాటలో భారత్‌

Aug 19 2026 5:05 AM | Updated on Aug 19 2026 5:12 AM

India close on victory in first Test against Sri Lanka

విజయానికి 6 వికెట్ల దూరంలో టీమిండియా

శ్రీలంక లక్ష్యం 372; ప్రస్తుతం 84/4

పంత్‌ అర్ధ సెంచరీ

గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయానికి చేరువైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 372 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆతిథ్య శ్రీలంక జట్టు నాలుగో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. వరుసగా నాలుగో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఫెర్నాండో (6), ఉడారా (16), సూర్యబండారా (0), కమిందు (2) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో 47/4తో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ లంకను కెపె్టన్‌ ధనంజయ డిసిల్వా (31 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), సోనాల్‌ దినుషా (25 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) ఆదుకున్నారు. చండిమాల్‌ గాయపడటంతో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సూర్యబండారా తొలి బంతికే అవుటయ్యాడు. 

భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌ 2 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, ప్రసిధ్‌ చెరో వికెట్‌ తీశారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న లంక విజయానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (69 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో దేవదత్‌ పడిక్కల్‌ (44; 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. జైస్వాల్‌ (0), కెపె్టన్‌ గిల్‌ (8), జురేల్‌ (7), జడేజా (9) విఫలమయ్యారు. ఒక దశలో 174/5తో పటిష్టంగా కనిపించిన టీమిండియా 19 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో 4, ప్రభాత్‌ జయసూర్య మూడు వికెట్లు పడగొట్టారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 284; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) డిక్‌వెలా (బి) ఫెర్నాండో 0; రాహుల్‌ (సి) (సబ్‌) రత్నాయక (బి) జయసూర్య 35; పడిక్కల్‌ (ఎల్బీ) (బి) నువాంతా 44; గిల్‌ (ఎల్బీ) (బి) జయసూర్య 8; పంత్‌ (సి) డిక్‌వెలా (బి) లహిరు 66; జురేల్‌ (సి) డిక్‌వెలా (బి) ఫెర్నాండో 7; 
జడేజా (సి) (సబ్‌) సూర్యబండారా (బి) లహిరు 9; సుతార్‌ (సి) డిక్‌వెలా (బి) ఫెర్నాండో 9; కుల్దీప్‌ (సి) ధనంజయ (బి) జయసూర్య 5; సిరాజ్‌ (నాటౌట్‌) 2; ప్రసిధ్‌ (సి) లహిరు (బి) ఫెర్నాండో 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 193. వికెట్ల పతనం: 1–0, 2–65, 3–81, 4–111, 5–120, 6–174, 7–179, 8–188, 9–190, 10–193. 
బౌలింగ్‌: ఫెర్నాండో 8.5–0–31–4; నువాంతా 23–3–86–1; జయసూర్య 11–0–43–3; ధనంజయ 1–0–4–0; లహిరు 5–0–28–2.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: మధుషంక (సి) ప్రసిధ్‌ (బి) సిరాజ్‌ 6; ఉడారా (సి) జురేల్‌ (బి) సుతార్‌ 16; సూర్యబండారా (ఎల్బీ) (బి) సుతార్‌ 0; కమిందు (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 2; ధనంజయ (బ్యాటింగ్‌) 31; దినుషా (బ్యాటింగ్‌) 25; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (34 ఓవర్లలో 4 వికెట్లకు) 84. వికెట్ల పతనం: 1–13, 2–14, 3–21, 4–47. బౌలింగ్‌: సిరాజ్‌ 5–1–11–1; సుతార్‌ 11–0–30–2; ప్రసిధ్‌ 8–2–13–1; జడేజా 6–0–16–0; కుల్దీప్‌ 3–0–8–0; పడిక్కల్‌ 1–0–5–0.

పంత్‌ @100 
టెస్టుల్లో 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా పంత్‌ చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా స్టోక్స్‌ (138; ఇంగ్లండ్‌), మెకల్లమ్‌ (107; న్యూజిలాండ్‌), గిల్‌క్రిస్ట్‌ (100; 
ఆ్రస్టేలియా) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌ పంత్‌. స్టోక్స్‌ 82 మ్యాచ్‌ల్లో 100 సిక్స్‌ల మార్క్‌ అందుకోగా... పంత్‌ అత్యంత వేగంగా కేవలం 51 టెస్టుల్లోనే సిక్స్‌ల సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున వీరేంద్ర సెహ్వాగ్‌ (91), రోహిత్‌ శర్మ (88) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement