హైకోర్టులో హెచ్‌సీఏకు ఎదురు దెబ్బ‌.. | Telangana High court restricts Hyderabad Cricket Association from financial decisions | Sakshi
Sakshi News home page

హైకోర్టులో హెచ్‌సీఏకు ఎదురు దెబ్బ‌..

Apr 21 2025 10:59 PM | Updated on Apr 21 2025 10:59 PM

Telangana High court restricts Hyderabad Cricket Association from financial decisions

తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో ఇటీవ‌లే  పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోషియేష‌న్‌కు ఆర్డ‌ర్స్ జారీ చేసింది. స్టాఫ్ జీతాలు మినహా ఎలాంటి ఆర్థికపరమైన చర్యలు తీసుకోరాదంటూ హెచ్‌సీఎకు హైకోర్టు సూచించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement