సురేశ్‌ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి | Team India Former Cricketer Suresh Raina Cousin Dies In Road Accident In Himachal Pradesh Says Report | Sakshi
Sakshi News home page

సురేశ్‌ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి

May 2 2024 4:06 PM | Updated on May 2 2024 4:29 PM

 Team India Former Cricketer Suresh Raina Cousin Dies In Road Accident In Himachal Pradesh Says Report

టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనాను అనుకోని దుర్ఘటనలు వెంటాడుతూ ఉన్నాయి. 2020 ఐపీఎల్‌ సీజన్‌ జరుగుతుండగా.. రైనా మేనమామ కుటుంబం మొత్తాన్ని దోపిడి దొంగలు అతి కిరాతకంగా చంపేయగా.. తాజాగా మరో మేనమామ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. 

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా పఠాన్‌కోట్‌-మండియా జాతీయ రహదారిపై రైనా కజిన్‌ (మామ కొడుకు) సౌరభ్‌ కుమార్‌ (29) స్కూటర్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాక్సీ ఇతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌరభ్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద సమయంలో సౌరభ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి  కూడా చనిపోయాడు.

సౌరభ్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు శుభమ్‌ (19) అని సమాచారం. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రైవర్‌ పేరు షేర్‌ సింగ్‌. ప్రస్తుతం షేర్‌ సింగ్‌ స్థానిక పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement