T20 WC: అక్తర్‌కు చెప్పాను.. పాకిస్తాన్‌ ఓటమి ఖాయం..

T20 WC Ind Vs Pak: Harbhajan Singh Reveals Conversation With Shoaib Akhtar - Sakshi

T20 World Cup 2021: Harbhajan Singh About Conversation with Shoaib Akhtar: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2021 ముగియగానే మరో క్రికెట్‌ పండుగ ఆరంభం కానుంది. అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ మొదలుకాబోతోంది. క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించే దాయాదుల మధ్య ఆసక్తికర పోరు అక్టోబరు 24న జరుగబోతోంది.  సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా- పాకిస్తాన్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు వెటరన్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌... పాకిస్తాన్‌ మాజీ ప్లేయర్‌ షోయబ్‌ అక్తర్‌ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి వెల్లడించాడు.

ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌తో భజ్జీ మాట్లాడుతూ... ‘‘షోయబ్‌ అక్తర్‌కు ఒకటే మాట చెప్పాను... మీరు మాకు మార్గం సుగమం చేస్తారు... మీరు ఆడతారు... కానీ ఓడిపోతారు... మీకు నిరాశ తప్పదు. మా జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. మా వాళ్లు మిమ్మల్ని కచ్చితంగా ఓడిస్తారని అక్తర్‌కు చెప్పాను’’ అని పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌ కప్‌ ఈవెంట్లలో ముఖాముఖి పోరులో పాకిస్తాన్‌పై ప్రతీసారి టీమిండియాదే పైచేయి.

7 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లలో భారత జట్టు పాక్‌పై జయభేరి మోగించింది. ఇక చివరిసారిగా 2019 ప్రపంచకప్‌ సందర్భంగా గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌తో తలపడ్డ పాకిస్తాన్‌... 89 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. 

భారత టీ 20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌),  కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.
రిజర్వ్‌ ఆటగాళ్లు: శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌

టి20 ప్రపంచకప్‌: పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌
రిజర్వ్‌ ఆటగాళ్లు- కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

చదవండి: IPL 2021 Final: ‘కెప్టెన్‌’ డ్రాప్‌ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top