Suryakumar Yadav: ఏమా కొట్టుడు.. 'మిస్టర్‌ 360' పేరు సార్థకం

Suryakumar Yadav Looks Terrific Batter Apt-For Mister 360 Player Vs ZIM - Sakshi

క్రికెట్‌లో కొందరు కొడుతుంటే చూడాలనిపిస్తుంటుంది. తమ కళాత్మక ఆటతీరుతో ఆటకే అందం తెచ్చిన ఆటగాళ్లను చూశాం. ఈ తరంలో కోహ్లి, విలియమ్సన్‌ లాంటి ఆటగాళ్లు ఇలాంటి కళాత్మక, సంప్రదాయ షాట్లతోనే రాణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం హిట్టింగ్‌నే మంత్రంగా జపిస్తూ ఆడుతుంటారు. వీళ్లందరిది ఒక శైలి అయితే మనకు తెలియని మూడో కోణం ఒకటి ఉంటుంది. బంతి పడితే చాలు కసితీరా బాదడమే.. అదీ మాములుగా కాదు.. క్రికెట్‌ గ్రౌండ్‌ సర్కిల్(360 డిగ్రీస్‌)లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి ఆటగాళ్లు కూడా అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకు చెందినవాడే టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌.

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఒక సంచలనం. చేసింది 25 బంతుల్లో 61 పరుగులే కావొచ్చు. కానీ అతను ఇన్నిం‍గ్స్‌ ఆడిన విధానం హైలైట్‌ అని చెప్పొచ్చు. శరీరాన్ని విల్లులా వంచుతూ గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతుంటే చూస్తున్న మనం వహ్వా అనుకుండా ఉండలేం. మాములుగా ఏ క్రికెటర్‌ అయినా తనకు సాధ్యమైనంత వరకు ఆడుతూ సిక్సర్లు, ఫోర్లు బాదడం చూస్తుంటాం.

కానీ సూర్య ఇన్నింగ్స్‌ చూస్తే ఎటు పడితే అటు యధేచ్చగా షాట్లు కొట్టాడు. బ్యాక్‌వర్డ్‌, అప్పర్‌ కట్‌, లాంగాన్‌, లాంగాఫ్‌, మిడాన్‌, మిడాఫ్‌, స్క్వేర్‌లెగ్‌, కవర్‌ డ్రైవ్‌.. ఇలా క్రికెట్‌లో ఎన్ని షాట్లు ఉంటే అన్ని షాట్లను సూర్య ట్రై చేశాడు. సూర్యకుమార్‌ కొట్టుడు చూస్తుంటే.. ఏమా కొట్టుడు అనుకుంటూనే అతని శరీరంలో స్రింగులేమైనా ఉన్నాయా అన్న డౌట్‌ రాక మానదు. 

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మిస్టర్‌ 360కి పెట్టింది పేరు. అతను బ్యాటింగ్‌ చేస్తుంటే గ్రౌండ్‌కు నలుమూలలా షాట్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతన్ని మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని అభివర్ణిస్తారు. కానీ సూర్యకుమార్‌ ఇవాళ ఏబీ డివిలియర్స్‌నే తలదన్నేలా కనిపిస్తున్నాడు. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడుతూ మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అనే పేరును సార్థకం చేసుకున్నట్లగానే అనిపిస్తుంది. 

అందరూ ఊహించినట్లే టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు తురుపుముక్క అయ్యాడు. అసలే కోహ్లి భీకరమైన ఫామ్‌లో ఉండడం సానుకూలాంశమనుకుంటే అగ్నికి వాయువు తోడైనట్లు సూర్యకుమార్‌ తన కెరీర్‌లోనే ఉన్నత ఫామ్‌ను కనబరుస్తూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈసారి సూర్యకుమార్‌ టీమిండియాకు టి20 ప్రపంచకప్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. 

చదవండి: సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సవాలే.. యువీలాగే సూర్య దంచికొడితే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-11-2022
Nov 07, 2022, 20:32 IST
Harbhajan Singh: వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌ ఫామ్‌ ప్రదర్శిస్తూ, గ్రూప్‌-2లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరిన టీమిండియా.. నవంబర్‌ 10న జరిగే...
07-11-2022
Nov 07, 2022, 19:30 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌ ఫామ్‌ కనబరుస్తూ సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. నవంబర్‌ 10న జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ...
07-11-2022
Nov 07, 2022, 18:54 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఇప్పటి దాకా (సూపర్‌-12 దశ) జరిగిన మ్యాచ్‌ల్లో ఉత్తమ మ్యాచ్‌ల జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 7)...
07-11-2022
Nov 07, 2022, 17:27 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్‌ అఫీషియల్స్‌ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 7) విడుదల...
07-11-2022
Nov 07, 2022, 16:27 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 కీలక దశలో ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్‌ డేవిడ్‌...
07-11-2022
Nov 07, 2022, 15:59 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నిన్న (నవంబర్‌ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చరిత్ర...
07-11-2022
Nov 07, 2022, 15:31 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో వరుస విజయాలు సాధిస్తూ, గ్రూప్‌-2లో తొలి స్థానంతో సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనైనా...
07-11-2022
Nov 07, 2022, 13:03 IST
టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 సూర్య.. అయితే ఈ లిస్టులో కోహ్లి తర్వాత మాత్రం
07-11-2022
Nov 07, 2022, 11:58 IST
సంచలనాల నెదర్లాండ్స్‌ జట్టులో భారత్‌, సౌతాఫ్రికాలో పుట్టిన ప్లేయర్లు!
07-11-2022
Nov 07, 2022, 10:17 IST
ICC T20 World Cup 2022- Semi Final Schedule: టీ20 ప్రపంచకప్‌-2022 తుది అంకానికి చేరుకుంది. సూపర్‌-12లో భాగంగా ఆదివారం...
07-11-2022
Nov 07, 2022, 09:26 IST
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: దక్షిణాఫ్రికాకు ఇది కొత్త కాదు... ఆ...
07-11-2022
Nov 07, 2022, 08:34 IST
వచ్చే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా నెదర్లాండ్స్‌.. మిగిలిన జట్లు ఏవంటే?
07-11-2022
Nov 07, 2022, 04:18 IST
సిడ్నీ: టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న...
07-11-2022
Nov 07, 2022, 04:10 IST
గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలోనే ఇంటికొచ్చిన భారత్‌ ఈసారి టోర్నీలో లీగ్‌ టాపర్‌గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా...
06-11-2022
Nov 06, 2022, 22:20 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లి చిత్ర విచిత్రమైన హావభావాలతో మెరిశాడు. క్యాచ్‌ పట్టినప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్‌.....
06-11-2022
Nov 06, 2022, 21:45 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్‌-12 పోటీల్లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 71 పరుగుల తేడాతో నెగ్గి...
06-11-2022
Nov 06, 2022, 21:05 IST
జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే...
06-11-2022
Nov 06, 2022, 19:04 IST
టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 దశ ఇవాళ్టితో(నవంబర్‌ 6) ముగిసింది. సూపర్‌-12లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల...
06-11-2022
Nov 06, 2022, 18:04 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 దశలో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి...
06-11-2022
Nov 06, 2022, 17:31 IST
టి20 ప్రపంచకప్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. అన్ని దారులు మూసుకుపోయాయన్న దశలో పాకిస్తాన్‌ అనూహ్యంగా సౌతాఫ్రికా,...



 

Read also in:
Back to Top