ఆసియా కప్–2027 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు టీమిండియా అర్హత సాధించడంలో విఫలం కావడంతో... భారత దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గత ఏడాది జూన్‌లో సునీల్ ఛెత్రి తొలిసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఛెత్రి నిష్క్ర మణ తర్వాత భారత జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది.
ఈ నేపథ్యంలో టీమిండియా అప్పటి హెడ్ కోచ్ మనోలో మార్కెజ్ అభ్యర్థన మేరకు ఈ ఏడాది సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని జాతీయ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. పునరాగమనం తర్వాత ఆరు మ్యాచ్‌లు ఆడిన ఛెత్రి ఒక్క గోల్ మాత్రమే చేశాడు.
మరోవైపు ఆసియా కప్–2027 టోర్నీ బెర్త్ కూడా టీమిండియాకు దక్కలేదు. దాంతో న్యూఢిల్లీకి చెందిన 41 ఏళ్ల సునీల్ ఛెత్రి మరోసారి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. భారత్ తరఫున 157 మ్యాచ్‌లు ఆడిన సునీల్ ఛెత్రి 95 గోల్స్ సాధించాడు.


