తొలి రౌండ్‌లోనే సుమిత్‌ పరాజయం | Sumit lost in the first round | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్‌లోనే సుమిత్‌ పరాజయం

Aug 15 2024 4:05 AM | Updated on Aug 15 2024 4:05 AM

Sumit lost in the first round

సిన్సినాటి ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం క్వాలిఫయింగ్‌లోనే ముగిసింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 74వ ర్యాంకర్‌ సుమిత్‌ 2–6, 4–6తో ప్రపంచ 119వ ర్యాంకర్‌ మెకంజీ మెక్‌డొనాల్డ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సర్విస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.. సుమిత్‌కు 7,290 డాలర్ల (రూ. 6 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement