శ్రీజకు నిరాశ | Sreeja lost in Asian table tennis | Sakshi
Sakshi News home page

శ్రీజకు నిరాశ

Sep 8 2023 3:00 AM | Updated on Sep 8 2023 3:00 AM

Sreeja lost in Asian table tennis - Sakshi

ప్యాంగ్‌చాంగ్‌ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ర్నీప్‌లో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ విభాగాల్లో  రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. సింగిల్స్‌ రెండో రౌండ్‌లో శ్రీజ 5–11, 6–11, 9–11తో ఇటో మిమా (జపాన్‌) చేతి లో ఓడిపోయింది.

డబుల్స్‌లో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన శ్రీజ–దియా (భారత్‌) జోడీ రెండో రౌండ్‌  లో 7–11, 6–11, 6–11తో సన్‌ యింగ్షా–వాంగ్‌ యిది (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది.  మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో శ్రీజ–హరీ్మత్‌ జోడీ 6–11, 7–11, 8–11తో తొమోకాజు–హినా హయాటా (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement