నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా | ICC World Cup 2023 South Africa Vs Netherlands: South Africa Win The Toss And Opt To Bowl First - Sakshi
Sakshi News home page

WC 2023 SA vs NED: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

Oct 17 2023 2:51 PM | Updated on Oct 17 2023 3:01 PM

South Africa vs Netherlands, 15th Match: South Africa opt bowl - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది.

ఇక ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ జట్టు ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్‌ షమ్సీ స్ధానంలో పేసర్‌ గెరాల్డ్ కోయెట్జీ​ జట్టులోకి వచ్చాడు. అదే విధంగా డచ్‌ జట్టు కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ర్యాన్ క్లైన్ స్ధానంలో లోగాన్ వాన్ బీక్ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్‌), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దట్, పాల్ వాన్ మీకెరెన్

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement