సౌతాఫ్రికా ఆల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా షుక్రి కాన్రాడ్‌ | Shukri Conrad Named South Africa Men's All Format Coach | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా ఆల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా షుక్రి కాన్రాడ్‌

May 9 2025 3:20 PM | Updated on May 9 2025 4:02 PM

Shukri Conrad Named South Africa Men's All Format Coach

సౌతాఫ్రికా సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా షుక్రి కాన్రాడ్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ (మే 9) ప్రకటించింది. కాన్రాడ్‌ 2023 నుంచి సౌతాఫ్రికా టెస్ట్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్ల పగ్గాలు కూడా అప్పజెప్పారు. ఏప్రిల్‌ వరకు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్లకు హెడ్‌ కోచ్‌గా రాబ్‌ వాల్టర్‌ ఉండేవాడు. వాల్టర్‌ తన పదవీకాలం ముగియండతో రాజీనామా చేశాడు. 

ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా కాన్రాడ్‌ 2027 వన్డే వరల్డ్‌కప్‌ వరకు కొనసాగుతాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. కాన్రాడ్‌ ఆథ్వర్యంలో సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టు ఈ దఫా (2023-25) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. వచ్చే నెలలో లార్డ్స్‌లో జరుగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా నియమితుడు కావడంపై కాన్రాడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

58 ఏళ్ల కాన్రాడ్‌ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఎలాంటి మ్యాచ్‌లు ఆడనప్పటికీ.. కోచింగ్‌లో అతనికి మంచి అనుభవం ఉంది. కాన్రాడ్‌ దేశవాలీ క్రికెట్‌లో వెస్ట్రన్‌ ఫ్రావిన్స్‌కు ఆడేవాడు. 1985-91 మధ్య కాలంలో అతను 9 మ్యాచ్‌లు ఆడి 324 పరుగులు, 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం చాలా మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం భారత్‌లో ఉన్నారు. అయితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ రద్దు కావడంతో (భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా) అంతా స్వదేశానికి తిరుగు ముఖం పట్టారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement