
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా శబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ద్విశతకం(269 పరుగులు), సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా శతక్కొట్టాడు.
తద్వారా ఓ టెస్టు మ్యాచ్‌లోఅత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్(430) నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో గిల్ తన ఆసాధరణ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా సత్తాచాటాలని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో గిల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.
95 ఏళ్ల రికార్డుపై కన్ను..
ఈ మ్యాచ్‌లో గిల్ 225 పరుగులు చేయగలిగితే.. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్‌పై 810 పరుగులు చేశాడు. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే కేవలం రెండు మ్యాచ్‌లలోనే 585 పరుగులు సాధించాడు. లార్డ్స్‌లో బ్రాడ్‌మాన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన మ్యాచ్‌లోనైనా కచ్చితంగా గిల్ అధిగమిస్తాడు.
గవాస్కర్ రికార్డుపై గురి..
అదేవిధంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. వెస్టిండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు చేయగా.. మరో రెండు చేస్తే వాల్కాట్ సరసన నిలుస్తాడు. అంతేకాకుండా టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గానూ శుబ్‌మన్ నిలుస్తాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ 4 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs ENG: రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్