Shreyas Iyer Replace Rohit Sharma As Test Captain: Reports - Sakshi
Sakshi News home page

టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. !

Jun 20 2023 5:11 PM | Updated on Jun 20 2023 5:31 PM

Shreyas Iyer Replace Rohit sharma as test captain: Reports - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధైపాక్షిక సిరీస్‌లలో లీడర్‌గా సఫలమైనప్పటికీ.. మెజర్‌ టోర్నీల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడు జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ (2022), డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణ పరాజయాలు మూటుగట్టుకుంది. దీంతో ప్రస్తుతం రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది.

అతడి స్ధానంలో మరో ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రోహిత్‌ కెప్టెన్సీకి ఇప్పట్లో వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత భారత జట్టుకు కొత్త నాయకుడు వచ్చే ఛాన్స్‌ ఉంది. 

అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ తర్వాత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌కు పాండ్యాకు భారత జట్టు పగ్గాలు అప్పజెప్పే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రోహిత్‌ గైర్హజరీలో భారత జట్టును పాండ్యానే నడిపిస్తున్నాడు. కానీ టెస్టుల్లో మాత్రం రోహిత్‌ వారుసుడు ఎవరన్నది ప్రస్తుతం అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న. ఈ రోహిత్‌ తర్వాత భారత టెస్టు కెప్టెన్సీ రేసులో అజింక్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే చాలా మంది గతంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న అజింక్య రహానేకు భారత టెస్టు కెప్టెన్సీ అప్పజెప్పాలని సూచిస్తున్నారు. అయితే రహానే వయస్సు దృష్ట్యా బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ స్ధానంలో టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయ్యర్‌కు కెప్టెన్సీ పరంగా అనుభవం కూడా ఉంది. 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా అయ్యర్‌ వ్యవహరించాడు. ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్‌.. నేషనల్‌ క్రికెట్ అకాడమీలో పునరవాసం పొందుతున్నాడు. అతడు తిరిగి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండిShubman Gill: శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం! టైటాన్స్‌కు గుడ్‌ బై! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement