భారత్‌ ఘనవిజయం  | Second win for Indian team | Sakshi
Sakshi News home page

భారత్‌ ఘనవిజయం 

Aug 7 2023 2:44 AM | Updated on Aug 7 2023 2:44 AM

Second win for Indian team - Sakshi

చెన్నై: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. మలేసియాతో ఆదివారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా 5–0 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున సెల్వం కార్తీ (15వ ని.లో), హార్దిక్‌ సింగ్‌ (32వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (42వ ని.లో), గుర్జంత్‌ సింగ్‌ (53వ ని.లో), జుగ్‌రాజ్‌ సింగ్‌ (54వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

భారత్‌కు మొత్తం తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు రాగా అందులో మూడింటిని సది్వనియోగం చేసుకుంది. నేడు జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్‌ ఆడుతుంది. ఆదివారం జరిగిన మిగతా రెండు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. చైనా–కొరియా 1–1తో, పాకిస్తాన్‌–జపాన్‌ 3–3తో ‘డ్రా’ చేసుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement