అనిరుధ్‌కు రెండో టైటిల్‌ | Second title for Anirudh | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌కు రెండో టైటిల్‌

Oct 7 2024 4:04 AM | Updated on Oct 7 2024 4:04 AM

Second title for Anirudh

విలేనా (స్పెయిన్‌): హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ ఈ ఏడాది తన ఖాతాలో రెండో అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. స్పెయిన్‌లో జరిగిన విలేనా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోరీ్నలో భారత్‌కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో కలిసి అనిరుధ్‌ విజేతగా నిలిచాడు. 

ఫైనల్లో అనిరు«ద్‌–నిక్కీ ద్వయం 7–6 (7/2), 6–4తో రొమైన్‌ అర్నియోదో (మొనాకో)–ఇనిగో సెర్వాంటెస్‌ (స్పెయిన్‌) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్‌–నిక్కీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశారు. 

టైటిల్‌ గెలిచే క్రమంలో భారత జంట ఈ టోర్నీలో ఒక్క సెట్‌ మాత్రమే కోల్పోయింది. అనిరుధ్‌–నిక్కీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 26 ఏళ్ల అనిరుధ్‌ ఈ ఏడాది మనాకోర్‌ ఓపెన్, ఓల్‌రాస్‌ ఓపెన్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి... ఓల్‌రాస్‌ ఓపెన్, విలేనా ఓపెన్‌లలో టైటిల్స్‌ సాధించాడు.   

Advertisement
 
Advertisement
Advertisement