మహబూబ్ నగర్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జడ్చర్ల అభివృద్ధి కోసం 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అన్నారు. మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు ఇస్తే.. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు.
నిరుధ్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నాగర్‌కర్నూల్‌లో కాంట్రాక్టర్ మరణిస్తే రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారు.. జడ్చర్లలో నేను చనిపోతేనే బిల్లులు ఇస్తారా? అలాగైతే నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం చావడానికి సిద్ధం. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రభుత్వం మనుగడ సాధిస్తుంది. పార్టీలకు అతీతంగా ఒక్కటై పోరాడుదాం. జడ్చర్లకు కాలువలు, సాగునీరు సాధించుకుందాం. జడ్చర్ల రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం


