రొయ్యపల్లిలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన | Huge response to the free medical camp at Royyapalli | Sakshi
Sakshi News home page

రొయ్యపల్లిలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Oct 26 2026 4:26 PM | Updated on Oct 26 2026 4:31 PM

Huge response to the free medical camp at Royyapalli

హత్నూర: సమాజంలోని పేద ప్రజలకు, మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో యోగేందర్ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొయ్యపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని రొయ్యపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 300 మంది గ్రామస్తులు శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య సేవలను పొందారు.

యోగేందర్ కృష్ణ చేతుల మీదుగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పోచ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.

వైద్యుల బృందం గ్రామస్తులకు బీపీ, షుగర్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఎముకల వైద్య పరీక్షలు మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం వైద్యులు ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చికిత్సను సూచించారు.

చికిత్సకు అనుగుణంగా ఉచిత మందుల పంపిణీ
వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి వారి ఆరోగ్య సమస్యలు, నిర్వహించిన పరీక్షలు మరియు వైద్యులు సూచించిన చికిత్సకు అనుగుణంగా ఉచిత మందులను అందజేశారు. బీపీ, షుగర్, దంత, కంటి, ఎముకలు మరియు సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. మందుల వినియోగం, మోతాదు మరియు తీసుకోవాల్సిన విధానం గురించి కూడా వైద్య సిబ్బంది గ్రామస్తులకు సూచనలు అందించారు.

ఇదీ చదవండి: ఖైరతాబాద్‌ నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తాం : పల్లపు గోవర్ధన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement