హైదరాబాద్: లిఫ్ట్‌లో ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని రామచంద్రారెడ్డినగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చంద్రజుపాలెంకి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రాపురంలో నివాసం ఉంటూ వాచ్‌మేన్‌గా ఉంటున్నాడు. రాత్రి 7గంటలకు కూతురు వర్షిత, కుమారుడు గిరివర్ధన్(4) ఆడుకుంటున్నారు.
అదే సమయంలో గిరివర్ధన్ లిఫ్ట్‌లోకి వెళ్లగా.. మొదటి అంతస్తులోకి వెళ్లగానే పెద్ద శబ్ధం వచి్చంది. వెంటనే వెళ్లి చూడగా లిఫ్ట్‌లో బాలుడు ఇరుక్కొని ఉన్నాడు. తీవ్రగాయాలైన అతడిని 108 అంబులెన్స్‌లో పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్‌స్పెక్టర్ జగన్నా«థ్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


