మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం | TDP Activists Allegedly Attempt to Attack Hafeez Khan | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం

Oct 26 2026 3:01 PM | Updated on Oct 26 2026 3:30 PM

TDP Activists Allegedly Attempt to Attack Hafeez Khan

కర్నూలు: స్థానిక ఎన్నికల వేళ టీడీపీ గూండాల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్‌ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడులకు ప్రయత్నించారు. 16వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొంతమంది టీడీపీ గూండాలు ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసులు రావడంతో అక్కడ నుంచి పచ్చమూకలు వెళ్లిపోయాయి. బెదిరింపులకు బయపడేదే లేదంటూ టీడీపీ నాయకులను హఫీజ్ ఖాన్ హెచ్చరించారు.

ఎన్నికల వేళ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరింపజేయాలని టీడీపీ గూండాలు ప్రయత్నాలు జరుపుతున్నారు. అభివృద్ధి చేస్తే దాన్ని చెప్పుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవం చేయాలనుకోవడం సరికాదని చెబుతున్నారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే కూటమి సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: కూటమి కుట్రలు.. నకిలీ నామినేషన్లు..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement