జ్యోతి సురేఖకు రెండో స్థానం  | Second position to Jyoti Surekha | Sakshi
Sakshi News home page

జ్యోతి సురేఖకు రెండో స్థానం 

Apr 24 2024 4:19 AM | Updated on Apr 24 2024 4:19 AM

Second position to Jyoti Surekha - Sakshi

షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్‌లో భాగంగా ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత క్రీడాకారిణులు  రాణించారు. మహిళల కాంపౌండ్‌ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

భారత్‌కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో,     పర్ణీత్‌ కౌర్‌ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్‌ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్‌ విభాగంలో టాప్‌ ర్యాంక్‌ను పొంది నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement