హైదరాబాద్‌లో ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ | Archery Premier League in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌

Jun 11 2026 3:22 AM | Updated on Jun 11 2026 3:22 AM

Archery Premier League in Hyderabad

సాక్షి, సిటీబ్యూరో: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో సీజన్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో గతేడాది ప్రారంభించిన ఈ లీగ్‌లో మొత్తం ఆరు (రాజ్‌పుతానా రాయల్స్, మైటీ మరాఠాస్, పృథ్వీరాజ్‌ యోధాస్, కాకతీయ నైట్స్, చెరో ఆర్చర్స్, చోళా చీఫ్స్‌) ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 8 నుంచి 18 వరకు నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా రెండో సీజన్‌ నిర్వహించనున్నట్లు ఏపీఎల్‌ డైరెక్టర్‌ అనిల్‌ కామినేని బుధవారం వెల్లడించారు. 

భారత స్టార్‌ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, అభిషేక్‌ వర్మతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్‌ ఆర్చర్లు వివిధ జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 48 మంది ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీపడనున్నారు. రాజ్‌పుతానా రాయల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుండగా... టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement