క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ  | Satvik pair in the quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ 

Aug 25 2023 3:03 AM | Updated on Aug 25 2023 1:39 PM

Satvik pair in the quarters - Sakshi

కోపెన్‌హాగెన్‌ (డెన్మార్క్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–15,  19–21, 21–9తో లియో రాలీ కార్నండొ–డానియెల్‌ మారి్టన్‌ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది.

మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ 14–21, 9–21తో టాప్‌ సీడ్‌ చెన్‌ క్వింగ్‌ చెన్‌–జియా యి ఫ్యాన్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ ప్రణయ్‌ (భారత్‌) 21–18, 15–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్‌ లో కియాన్‌ యూ (సింగపూర్‌)పై సంచలన విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... లక్ష్య సేన్‌ (భారత్‌) 14–21, 21–16, 13–21తో మూడో సీడ్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement