సంజూ శాంసన్‌ చితక్కొట్టుడు.. | Sanju Samson Slams 19 Balls Fifty | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్‌ చితక్కొట్టుడు..

Sep 22 2020 8:25 PM | Updated on Sep 22 2020 11:03 PM

Sanju Samson Slams 19 Balls Fifty - Sakshi

సంజూ శాంసన్‌(ఫైల్‌ఫోటో)

షార్జా: ఐపీఎల్‌-13లో భాగంగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో  మరిపించాడు. సీఎస్‌కే బౌలర్లను చితక్కొడుతూ చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్‌(6) ఔటైన తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచింది. టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఎలా ఉండాలో చూపిస్తూ ఎంఎస్‌ ధోనికి బ్రెయిన్‌కు పదును పెట్టాడు. రవీంద్ర జడేజాను రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత పీయూష్‌ చావ్లాను బౌలింగ్‌కు దింపగా, అతన్ని కూడా ఉతికి ఆరేశాడు సంజూ శాంసన్‌. రాజస్తాన్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా శాంసన్‌ నిలిచాడు.దాంతో రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోరు 8 ఓవర్లలో 96 పరుగులు చేసింది.

రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.  ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ 22 మ్యాచ్‌లు జరగ్గా 14 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయం సాధించింది. ఇక మరో ఎనిమిది మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ గెలుపును అందుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement