
ఆస్ట్రేలియా-ఏ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 16 నుంచి మొదలు కానుంది.
ఈ పర్యటన కోసం రెండు వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను (రెండు ఫార్మాట్ల కోసం) ఇవాళ (ఆగస్ట్ 7) ప్రకటించారు. టెస్ట్ జట్టులో సామ్ కొన్‌స్టాస్ ఎంపిక హైలైట్‌గా నిలిచింది. అతని టాలెంట్‌కు భారత్‌లోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై కఠినమైన సవాళ్లు ఎదురు కానున్నాయి.
భారత్‌తో జరిగిన తన డెబ్యూ సిరీస్‌లో (బీజీటీ 2024-25) బుమ్రాతో గొడవపడి వార్తల్లోకెక్కిన కొన్‌స్టాస్.. ఆతర్వాత లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్ మీడియా కొన్‌స్టాస్‌కు భారీ హైప్ ఇస్తుంటుంది. మరో రికీ పాంటింగ్‌తో పోలుస్తుంది.
కొన్‌స్టాస్‌కు 2027 బీజీటీ కోసం సిద్దం చేసేందుకు ఆసీస్ సెలెక్టర్లు భారత్-ఏతో సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ జట్టులో కొన్‌స్టాస్‌తో పాటు ఆసీస్ టెస్ట్ ప్లేయర్లు కూపర్ కొన్నోలీ, టాడ్ మర్ఫీ, నాథన్ మెక్‌స్వీకి చోటు దక్కింది. వన్డే జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. 26 ఏళ్ల ఆరోన్ హార్డీనే జట్టులో అతి పెద్ద వయస్కుడు. ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు కూడా చోటు లభించింది.
షెడ్యూల్..
సెప్టెంబర్ 16 నుండి 19- తొలి టెస్ట్ (లక్నో)
సెప్టెంబర్ 23 నుంచి 26- రెండో టెస్ట్ (లక్నో)
సెప్టెంబర్ 30- తొలి వన్డే (కాన్పూర్)
ఆక్టోబర్ 3- రెండో వన్డే (కాన్పూర్)
అక్టోబర్ 5- మూడో వన్డే (కాన్పూర్)
భారత్-ఏతో నాలుగో రోజుల మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు: జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, ఆరోన్ హార్డీ, కాంప్‌బెల్ కెల్లావే, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఓలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్
భారత్-ఏతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు: కూపర్ కొన్నోలీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, కల్లమ్ విడ్లర్