క్వార్టర్స్‌లో సాకేత్‌–యూకీ జోడీ ఓటమి  | Saket Maineni Yuki Bambri pair fight is over ij dubai open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్‌–యూకీ జోడీ ఓటమి 

Mar 3 2023 2:41 AM | Updated on Mar 3 2023 2:41 AM

Saket Maineni Yuki Bambri pair fight is over ij dubai open - Sakshi

దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ చాంపియన్‌షిలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 2–6, 2–6తో లాయిడ్‌ గ్లాస్‌పూల్‌ (బ్రిటన్‌)–హ్యారీ హెలియోవారా (ఫిన్‌లాండ్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు.

నాలుగుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయిన భారత జోడీ ప్రత్యర్థి జంట సర్విస్‌లో మూడుసార్లు బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలను వదులుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన  సాకేత్‌–యూకీ బాంబ్రీలకు 23,660 డాలర్ల (రూ. 19 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. ఇదే టోర్నీలో రామ్‌కుమార్‌ (భారత్‌)–ఐజామ్‌ ఖురేషీ (పాకిస్తాన్‌) జోడీ తొలి రౌండ్‌లో 4–6, 6–3, 5–10తో సాండెర్‌ జిలె–విలెజిన్‌ (బెల్జియం) ద్వయం చేతిలో ఓడిపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement