పాటియాలా: కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో... రెండుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ నిఖత్ జరీన్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన 51 కేజీల విభాగం సెమీఫైనల్లో తెలంగాణకు చెందిన నిఖత్ 1:4 తేడాతో సరీ్వసెస్ బాక్సర్ సాక్షి చౌధరీ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో నిఖత్ కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా పోయింది. 29 ఏళ్ల నిఖత్ 2022 బరి్మంగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం... 2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచింది.


