క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక జోడీ  | Rutvika Jodi in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక జోడీ 

Apr 5 2024 3:49 AM | Updated on Apr 5 2024 3:49 AM

Rutvika Jodi in the quarter final - Sakshi

అస్తానా: కజకిస్తాన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుత్విక–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 22–20, 21–17తో కెన్నెత్‌–గ్రోన్యా సోమర్‌విల్లె (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది.

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌ ఆటగాడు తరుణ్‌ మన్నెపల్లి 22–24, 21–18, 21–13తో భారత్‌కే చెందిన శంకర్‌ ముత్తుస్వామిపై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌ లో జాతీయ చాంపియన్‌ అన్‌మోల్‌ 21–11, 21–7తో నూరానీ అజారా (యూఏఈ)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 

Advertisement
 
Advertisement
Advertisement