ఐపీఎల్‌-2026 సీజన్‌ విజేతగా ఆర్సీబీ | Royal Challengers Bengaluru vs Gujarat Titans IPL 2026 Final live updates | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2026 సీజన్‌ విజేతగా ఆర్సీబీ

May 31 2026 7:02 PM | Updated on May 31 2026 11:30 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans IPL 2026 Final live updates

IPL 2026 RCB vs GT Live Updates:  ఐపీఎల్‌-2026 విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిది కీలక పాత్ర. 

156 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో  75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా గుజరాత్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ
విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 25 బంతుల్లోనే కోహ్లి ఆర్ధ సెంచరీ సాధించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 116/4

ఊహించ‌ని ట్విస్ట్‌.. నాలుగో వికెట్ డౌన్‌
గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న ఐపీఎల్‌ ఫైన‌ల్ పోరులో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు తీశాడు. ముందు పాటీదార్ (15)ను వెన‌క్కి పంపిన ర‌షీద్‌.. ఆ త‌ర్వాత కృనాల్ పాండ్యా (1)ను వికెట్ల ముందు దొరక‌బుచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 100 ప‌రుగులు చేసింది.

8 ఓవర్లలో ఆర్సీబీ 88-2
8 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (38), రజత్ పాటీదార్ (15) పరుగులతో ఆడుతున్నారు.

ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దేవ్‌దత్త్‌ పడిక్కల్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 16 బంతుల్లో 32 పరుగులు చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దుమ్ములేపుతున్న విరాట్‌ కోహ్లి
158 పరుగుల లక్ష్య చేధనలో విరాట్‌ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కోహ్లి కేవలం పది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌(26) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్‌ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ దాటింది.

దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుం‍డా 23 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌(22) దూకుడుగా ఆడుతున్నాడు.

ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే?
అహ్మదాబాద్‌ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌(50) హాఫ్‌ సెంచరీతో గుజరాత్‌ను ఆదుకున్నాడు. 

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(12), సాయిసుదర్శన్‌(12), జోస్‌ బట్లర్(19) వంటి స్టార్‌ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

ఏడో వికెట్‌ డౌన్‌
గుజరాత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హోల్డర్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18.4 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 143/7

ఆరో వికెట్ కోల్పోయిన గుజ‌రాత్‌
ఆర్సీబీతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 115 ప‌రుగుల‌వ వ‌ద్ద‌ ఆరో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన రాహుల్ తెవాటియా ర‌సిక్ స‌లామ్ బౌలింగ్‌లో పాటీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఐదో వికెట్‌ డౌన్‌
అర్షద్‌ ఖాన్‌(15) రూపంలో గుజరాత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అర్షద్‌ ఔటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న అర్షద్‌ ఖాన్‌
జోష్‌ బట్లర్‌ స్ధానంలో క్రీజులోకి వచ్చిన అర్షద్‌ ఖాన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 5 బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 100/4

గుజరాత్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్ల పతనం కొనసాగుతోంది. జోస్‌ బట్లర్‌(19) రూపంలో గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 12.1 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 73/4

గుజరాత్‌ మూడో వికెట్‌ డౌన్‌
నిషాంత్‌ సింధు రూపంలో గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సింధు.. రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్‌ సుందర్‌(2), జోస్‌ బట్లర్‌(2) ఉన్నారు.

గుజరాత్‌కు భారీ షాక్‌
గుజరాత్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ సాయిసుదర్శన్‌(12) రూపంలో గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సుదర్శన్‌ ఔటయ్యాడు. 4 ఓవర్లు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 30/2

గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. రజత్‌ పాటిదార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

2 ఓవర్లకు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 18/0
2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(6), సాయిసుదర్శన్‌(9) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో తుది పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ  హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్‌ సాయికిషోర్‌ స్ధానంలో పేసర్‌ అర్షద్‌ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement